అక్షర న్యూస్ : జాతీయ రహదారి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో రెవెన్యూ మరియు నేషనల్ హైవే అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ సిద్దిపేట సిరిసిల్ల జాతి రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ ప్రారంభించి ఇన్ టైమ్ లో భూ సేకరణ పూర్తి చెయ్యాలని అన్నారు. అలాగే మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారిలో మెదక్ సిద్దిపేట మధ్య నిర్మాణం పూర్తికాని ప్రాంతాలలో వెంటనే పూర్తి చెయ్యాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీఓ సధానందం, నేషనల్ హైవే ఇఇ బలరామకృష్ణయ్య, సంభంధిత మండలాల తహసీల్దార్ లు తదితరులు పాల్గొన్నారు.