అక్షర న్యూస్ :స్వచ్చ సిద్దిపేట వైపు అడుగులు వేయుటకు మొదలుపెట్టిన ఇంటింటి చెత్త సేకరణ విజయవంతం కావడం ప్రతి ఇంటి నుండి వెలువబడినటువంటి చెత్తను తడి, పొడి, హానికర వేరు చేసి ఇచ్చుటలో గృహ నివాసితులకు అవగాహన కల్పించడంలో సిద్దిపేట పురపాలక సంఘం విజయవంతమైంది. ప్రతిరోజు ఇంటి నుండి వెలువడి చెత్తను ఏ రకంగా తడి,పొడి,హానికర చెత్తగా వేరు చేసి ఇస్తున్నారో పురపాలక సంఘాల కమిషనర్ లు, అధికారులు పరిశీలించారు. పట్టణంలో ప్రతి శుక్రవారం మరియు మంగళవారం పొడి చెత్త మిగతా వారాలలో తడి చెత్త వేరు చేసి ఇచ్చి విధానాన్ని పరిశీలించారు. 43 వ వార్డులలో పర్యటిస్తూ గృహ నివాసితులతో మాట్లాడి చెత్త వేరు చేయు విధానం అడిగి తెలుసుకున్నారు. అనంతరం బయో గ్యాస్ ప్లాంట్,ఇంటింటి నుంచి సేకరించిన తడి చెత్తను సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో బుస్సాపూర్ లో ఏర్పాటు చేసిన గృహ వ్యర్థాల నుంచి CNG ఉత్పత్తి చేసే బయో గ్యాస్ ప్లాంట్‌ను సందర్శించారు. ఆతర్వాత బయో మైనింగ్ ప్రక్రియను అధికారులు పరిశీలించటం జరిగింది.స్వచ్చ బడి సందర్శనకు వచ్చిన అధికారులకు జ్ఞాపికగా అగర్బత్తి (కొబ్బరి పీచుతో తయారయ్యాయి),స్టీల్ వాటర్ బాటల్,సేంద్రియ ఎరువు,కలము ఇవ్వడం జరిగింది. అనంతరం కోమటి చెరువు సందర్శించడం జరిగింది.కార్యక్రమంలో చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు గారు,కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు,వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు గారు,కౌన్సిల్ సభ్యులు, 11 పురపాలక సంఘాల కమిషనర్ లు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
![](https://aksharanews.com/wp-content/uploads/2024/10/1000322213-1024x683.jpg)
![](https://aksharanews.com/wp-content/uploads/2024/10/1000322212-1024x683.jpg)
![](https://aksharanews.com/wp-content/uploads/2024/10/1000322210-1024x683.jpg)