• Mon. Feb 3rd, 2025

అక్షర న్యూస్ : గుర్తుతెలియని వాళ్లకు మీ బ్యాంకు ఎకౌంటు గాని, మీపేరు పై ఉన్న సిమ్ కార్డు ఇవ్వవద్దు..

Bypentam swamy

Oct 27, 2024

అక్షర న్యూస్ :జిల్లాలోని ప్రజలకు యువకులకు పోలీసుల విజ్ఞప్తి 

కొంతమంది యువకులకు, అమాయక ప్రజలకు లేనిపోని కట్టు కథలు చెప్పి కొద్ది మొత్తంలో డబ్బులు ఇచ్చి మీ అకౌంట్ అకౌంట్లో డబ్బులు ట్రాన్జక్షన్ చేస్తే రెండు నుండి ఐదు పర్సెంట్ డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయించి, ఓపెన్ చేయించిన తర్వాత కొన్ని డబ్బులు ఇచ్చి, ఆ బ్యాంకు కు సంబంధించిన అకౌంట్లకు పాస్ బుక్కులు, అకౌంట్ నెంబర్లు మరియు బ్యాంకు ఎకౌంటుకు కనెక్ట్ ఉన్న సిమ్ కార్డ్ తీసుకొని వెళ్లి సైబర్ నేరగాళ్లు ఈ అకౌంట్ నెంబర్లు సైబర్ నేరాలు చేయడానికి ఉపయోగించుకుంటున్నారు 

అక్షర న్యూస్ : పదోన్నతులు పోలీస్ లకు మరింత బాధ్యతను పెంచుతాయి..

సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్ లోకి పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం మరియు విత్ డ్రా చేసుకోవడం జరుగుతుంది. బ్యాంక్ అకౌంటు మరియు సిమ్ కార్డ్ ఇచ్చిన యువకులు అమాయక ప్రజలు పోలీసు కేసులలో ఇరుక్కుంటున్నారు.సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రజలు, యువకులు, ఎవరు కూడా మీ బ్యాంకు అకౌంట్లు కమిషన్ ఇప్పిస్తామని అడిగినా మాయ మాటలు చెప్పి మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేసే వారిపై అప్రమత్తంగా ఉండాలి, అలాంటి వ్యక్తులు గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ మీ దగ్గరికి వచ్చి బ్యాంకు అకౌంట్ కానీ, సిమ్ కార్డు ఎవరైనా అడిగితే వెంటనే డయల్ 100 కాల్ చేసి తెలుపాలని లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100, సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ మేడమ్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

అక్షర న్యూస్ : సిద్దిపేట లాల్ కమాన్ పైన మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు..