• Tue. Feb 4th, 2025

అక్షర న్యూస్ : 27 న సిద్దిపేట లో G.N. సాయిబాబా సంస్మరణ సభ..

Bypentam swamy

Oct 24, 2024

అక్షర న్యూస్ : ఈ నెల 27 ఆదివారం రోజున సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఇటీవల మృతి చెందిన ప్రొఫెసర్, ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన నాయకుడు G. N. సాయిబాబా సంస్మరణ సభ జరుగుతుందని సాయిబాబా సంస్మరణ సభ నిర్వహణ కమిటీ తెలిపింది.. సభ ఆహ్వాన పత్రాన్ని సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో బుధవారం నిర్వహణ కమిటీ సభ్యులు TG CLC ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్, రాగుల భూపతి, TPF జిల్లా కన్వీనర్ G. సత్తయ్య, రచయిత సామాజిక ఉద్యమ కారుడు దారం మల్లా రెడ్డి, TPTF నాయకుడు తిరుపతి రెడ్డి,TUWJ (IJU )జిల్లా అధ్యక్షులు కె. రంగాచారి, మంజీరా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి సిద్దంకి యాదగిరి, ఉపాధ్యక్షుడు అలాజ్ పూర్ శ్రీనివాస్, తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నాల బాలయ్య, కవి వి. సంతోష్, అడ్వకెట్ కర్రల రవి బాబు, తిప్పర వేణి రాజు, మోకు నర్సింలు లు విడుదల చేశారు.. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రెస్ క్లబ్ లో సంస్మరణ సభ ప్రారంభం అవుతుందని తెలిపారు. సభలో వివిధ ప్రజా సంఘాల, రచయితల సంఘాల, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.. ఆదివాసీ హక్కుల కోసం.. పౌర ప్రజా స్వామిక హక్కుల కోసం.. దోపిడీ లేని సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన సాయిబాబా ను స్మరించుకునే క్రమం లో ఈ సభను ఏర్పాటు చేసినట్టు సభ్యులు తెలిపారు.. సంస్మరణ సభకు సాయిబాబా అభిమానులు.. ప్రజాస్వామిక వాదులు పెద్ద సంఖ్య లో హాజరుకావాలని పిలుపునిచ్చారు..

అక్షర న్యూస్ : పదోన్నతులు పోలీస్ లకు మరింత బాధ్యతను పెంచుతాయి..

అక్షర న్యూస్ : సిద్దిపేట లాల్ కమాన్ పైన మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు..