• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ : ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..

Bypentam swamy

Oct 15, 2024

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

అక్షర న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అర్హులైన ప్రజలకు అందేలా చూడాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రి దామోదర రాజనర్సింహ గారు సూచించినట్లు కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ తెలిపారు. హైదరాబాదులోని గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని మంత్రి దామోదర రాజనర్సింహ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అత్తు ఇమామ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచనతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన పట్టణ అధ్యక్షులు గయాజుద్దీన్, నజ్జు, మధు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : పదోన్నతులు పోలీస్ లకు మరింత బాధ్యతను పెంచుతాయి..