అక్షర న్యూస్ :శ్రీవాణి స్కూల్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ కమిషనరేట్ సిద్దిపేట జిల్లా శాఖ వారు నిర్వహించిన జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలలో.సిద్దిపేట పట్టణ భారత్ నగర్ లోని శ్రీ వాణి స్కూల్ విద్యార్థులు బుధవారం రోజున పాఠశాలలో నిర్వహించిన వ్యాసరస పోటీలలో పాల్గొనడం జరిగింది. పాఠశాలలోని 8 వ ,9 వ,10 వ తరగతి విద్యార్థిని విద్యార్థులు విచక్షణ తో కూడిన చరవాణి వాడకం అన్న అంశం పైన వ్యాసo రాయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సి.హెచ్ సత్యం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల ద్వారా చెడు ప్రభావం ఉంటుందని వాటిని అవసరం మేరకే వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృపాకర్ , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.