అక్షర న్యూస్ :కమిషనర్ అశ్రిత్ కుమార్ గారి ఆదేశాలమేరకు పట్టణంలోని పలు అక్రమ కట్టడాలను దేవరాజు (TPO) గారు సిబ్బందితో కూల్చివేతలు చేయటం జరిగింది. స్థానిక పట్టణంలోని 23 వార్డులో శివాజీ నగర్ లో రోడ్డు ఆక్రమణ చేసి ఐరన్ మెట్లు ఏర్పాటు చేసినవాటిని, మురికి కాలువ ఆక్రమణ నిర్మాణం మరియు అదనపు ఫ్లోర్ యొక్క స్లాబ్ నిర్మాణాలను పోలీసుల సహకారంతో కూల్చివేత చేయటం జరిగింది. వీరందికి ఇదివరకే నోటీసులు జారీ చేయటం జరిగిందని కానీ ఎలాంటి స్పందన లేకపోవడం వలన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. పట్టణంలో నూతన గృహ యజమానులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని తీసుకున్న అనుమతులకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని పట్టణ ప్రజలకు సూచించారు.