• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ : సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ రాష్ట్రం జితేందర్ గారు..

Bypentam swamy

Oct 24, 2024

అక్షర న్యూస్ : పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ మేడమ్ గారు మొక్కను అందజేసి స్వాగతం పలికారు. డీజీపీ గారు పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి కమిషనర్ కార్యాలయ చుట్టూ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పచ్చదనం పరిశుభ్రతతో ఆహ్లాదకరంగా ఉందని కొనియాడారు.జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులతో తెలంగాణ రాష్ట్ర డిజిపి డాక్టర్ జితేందర్ ఐపీఎస్ గారు సమీక్ష నిర్వహించారు.డాక్టర్ జితేందర్, ఐపీఎస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ రాష్ట్రం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అని చెప్పడం జరిగంది.కేసుల్లో శిక్షల శాతం పెంచాలి, ప్రోయాక్టివ్ పోలీసింగ్ విధులు నిర్వహించాలి.సంఘ విద్రోహ శక్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలి,శాంతి భద్రతలకు పెద్దపీట వేయాలి.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి, అనురాధ, ఐపీఎస్ మేడమ్ గారు, 2022, 2023, 2024, సంవత్సరాలలో నమోదైన కేసుల గురించి జిల్లా పరిధిలో ఉన్న ఇతర బార్డర్ పోలీస్ స్టేషన్, జిల్లాలో ఉన్న పోలీస్ స్టేషన్లో, సబ్ డివిజన్లో మరియు అధికారుల సిబ్బంది యొక్క వివరాలు గత మూడు సంవత్సరాలలో నమోదైన కేసుల వివరాలు జిల్లాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, విపిఓ విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ గురించి, పిల్లల మహిళలు, రక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ గురించి, కళాబృందం భరోసా సెంటర్, రోడ్డు ప్రమాదాల నివారణ కమిటీలు, యాంటీ డ్రగ్స్ కమిటీలు మరియు ప్రతిరోజు జిల్లాలో నిర్వహిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ వర్కు మరియు కేసుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డిజిపి గారికి వివరించారు.ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ యస్. మల్లారెడ్డి, ఏఆర్ అడిషనల్ డీసీపీ రామచంద్రరావు, సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు మధు, పురుషోత్తం రెడ్డి, సతీష్, సుమన్ కుమార్, యాదగిరి, రవీందర్, శ్రీనివాస్ ఎస్బి ఇన్స్పెక్టర్లు కిరణ్, శ్రీధర్, శ్రీధర్ గౌడ్, ఏఓ యాదమ్మ, సూపరిండెంట్లు మమ్మద్ ఫయాజుద్దీన్, అబ్దుల్ ఆజాద్, ఇన్స్పెక్టర్లు/ సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..