అక్షర న్యూస్ : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని వివిధ పత్రికలలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతోపాటు, ప్రభుత్వ పథకాలు అందజేయాలని మంత్రపురి ప్రెస్ క్లబ్ సభ్యులు డి జె ఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్డీవో,తోపాటు మండల తహశీల్దార్ కు మంగళవారం వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా మంత్రపురి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గడిపెల్లి అజయ్ మాట్లాడుతూ.. అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండా చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అనే తారతామ్యం చూపకుండా కష్టపడే వర్కింగ్ జర్నలిస్టు లందరికీ ప్రభుత్వ పథకాలు అందజేయాలని కోరారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికి ఇంటి స్థలాలు, కేటాయిస్తామన్నారు. దీనిలో భాగంగా అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండానే వివిధ పత్రికల్లో పని చేస్తున్న మండలంలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని అన్నారు.అక్రిడిటేషన్ పేరుతో కొంత మందికే ఇంటి స్థలాలు కేటాయించడం సరికాద న్నారు. ఈ కార్యక్రమంలో మంత్రపురి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గడిపల్లి అజయ్ తో పాటు వివిధ పత్రిక జర్నలిస్టులు పాల్గొన్నారు.