• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ : నూతన టెక్నాలజీ తో వచ్చిన స్పీడ్ లేజర్ గన్ ను పరిశీలించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ..

Bypentam swamy

Oct 22, 2024

అక్షర న్యూస్ :నూతన టెక్నాలజీతో వచ్చిన స్పీడ్ లేజర్ గన్ ఏ విధంగా వేగాన్ని క్యాప్చర్ చేస్తుంది ఎంత దూరం నుండి క్యాప్చర్ చేస్తుంది ఏ విధంగా పనిచేస్తుంది బ్యాటరీ చార్జింగ్ ఎన్ని గంటలు వస్తుంది తదితర అంశాలను ఆపరేటర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ జగదీశ్వర్ ను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడం గారు మాట్లాడుతూ రాజీవ్ రహదారిపై స్పీడ్ లేజర్ గన్ ఉపయోగించడం జరుగుతుందన్నారు వాహనదారులు అధిక వేగంతో వెళ్లి ప్రాణాలు పోగొట్టుకొని కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని మిగిలించవద్దని తెలిపారు. అతివేగం ఎప్పటికైనా ప్రమాదకరమన్నారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే స్పీడ్ లేజర్ గన్ ఉపయోగించడం జరుగుతుందన్నారు.
వాహనాలు అధిక వేగంతో వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని, ప్రమాదాల నివారణ గురించి పోలీసులు తెలుసుకుంటున్న చర్యలకు వాహనదారులు సహకరించాలని సూచించారు. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని తెలిపారు. 90 కంటే ఎక్కువ వేగంతో వెళ్లే వాహనాలపై స్పీడ్ లేజర్ గన్ ద్వారా కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..