అక్షర న్యూస్ : ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) సందర్భంగా పోలీస్ కమిషనరేట్ పెరేడ్ గ్రౌండ్లో పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ఐపీఎస్ మేడమ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీ మను చౌదరి, ఐఏఎస్., గారు ముఖ్యఅతిథిగా పాల్గొని పోలీస్ గౌరవవందనం స్వీకరించి. తదనంతరం, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ అడిషనల్ డీసీపీలు ఎస్ మల్లారెడ్డి, రామ్ చందర్రావు, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసిపి మధు, ఎస్పీ ఇన్స్పెక్టర్ కిరణ్, జిల్లా పోలీసు అధికారులు, మరియు అమరుల పోలీస్ కుటుంబ సభ్యులతో మరియు అధికారులు సిబ్బంది కలిసి పోలీస్ అమర వీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు వేసి శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ పూర్ణచందర్ ఆర్ఎస్ఐలు సాయిప్రసాద్ బాలకృష్ణ ఆర్ఎస్ఐ ఆధ్వర్యంలో స్మృతి పెరేడ్ గౌరవ వందనం ఘనంగా నిర్వహించడం జరిగింది.పోలీసులు విపత్కర, క్లిష్ట పరిస్థితులలో వారి ఆరోగ్యాన్ని సహితం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగడానికి శాంతిభద్రతలు చాలా ముఖ్యం అందుకు పోలీసు పాత్ర సమాజానికి ముఖ్యమని తెలియజేశారు .ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ గురించి నిరంతరం కృషి చేస్తున్న పోలీసులను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకునే అవసరం ఎంతైనావుంది.భారతదేశ రక్షణ, ప్రజాస్వామ్య విలువలు కాపాడడంలో ఎనలేని కృషి చేస్తున్న పోలీసులకు నా ప్రత్యేక అభినందనలు. పోలీసులు త్యాగాలకు సైతం భయపడకుండా కార్యసాధనలో వెనుకడుగు వేయకుండా రెట్టించిన సమరోత్సాహంతో అసాంఘిక శక్తులతో పోరాడి విజయాన్ని పొందాలని ఆకాంక్షించారు.