అక్షర న్యూస్ :చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు గారు,కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు,వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు గారు విద్యుత్ శాఖ ADE గారితో పురపాలక సంఘ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించటం జరిగింది. 28-12-2023 రోజు నుండి 06-01-2024 వరకు ప్రజాపాలన లో భాగంగా పట్టణ ప్రజల నుండి సేకరించిన 6 గ్యారంటీలలో 200 యూనిట్ ల మేర ఉచిత విద్యుత్ అందించాలన్న లక్ష్యంతో తీసుకువచ్చిన గృహ జ్యోతి పథకం అర్హులు ఎవరైతే ఉన్నారో అద్దె గృహాలలో ఉంటూ వేరే గృహాలకు అద్దెకు వెళ్లిన గృహ జ్యోతి అర్హులు తమ ఆధార్ కార్డు మరియు అద్దెకు మారిన ఇంటి కరెంట్ బిల్ తీసుకువచ్చినట్లు అయితే మున్సిపల్ మరియు విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో అట్టి కరెంట్ బిల్ యొక్క USC నంబర్ ద్వారా మార్పులు చేయబడతాయని తెలిపారు. గృహ జ్యోతి పథకం అర్హులందరికీ లబ్ధి చేకూర్చేలా మున్సిపల్ మరియు విద్యుత్ శాఖ అధికారులమంతా సమన్వయంతో పని చేస్తామని తెలిపారు. నూతన గృహ జ్యోతి పథకం కొరకు ఇటీవల మున్సిపల్ కార్యాలయంలో ఇచ్చిన దరఖాస్తులు ప్రభుత్వం ఆన్లైన్ ఆప్షన్ ఇవ్వగానే నమోదు చేస్తామని తెలిపారు. సమావేశంలో నాయకం లక్ష్మణ్(కౌన్సిలర్)గారు, మున్సిపల్ వార్డు ఆఫీసర్ లు,విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.