• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ : సేవా కార్యక్రమాల్లో స్వర్ణనంది, డాక్టరేట్ అవార్డు అందుకోవడం అభినందించదగ్గ విషయం..

Bypentam swamy

Oct 21, 2024

అక్షర న్యూస్ :సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన
శ్రీభక్త ఆంజనేయ దేవాలయ అర్చకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆయుర్వేద ప్రముఖులు వరయోగుల వెంకటేశ్వర స్వామికి ఇటీవల తెలుగు సంస్కృతి సాహితీ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వర్ణనంది మరియు డాక్టరేట్ అవార్డును తీసుకున్న సందర్భంగా సోమవారం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వంశీధర్ ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ముఖ్య అతిథుల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీయూడబ్ల్యూజే జిల్లా మరియు సిద్దిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రంగాచారి, టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు సంజీవ రెడ్డి, ప్రముఖ డాక్టర్ విష్ణుకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి రంగాచారి మాట్లాడుతూ….వరయోగుల వేంకటేశ్వర స్వామి తన వృతిలోనే కాకుండా ప్రవృత్తిలో కూడా అంచెలంచేలుగా ముందుకు వెళుతూ సేవా కార్యక్రమాలు చేయడం అభినందించదగ్గ విషయమని అన్నారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన వారిలో వాస్తు జ్యోతిష్య ఆయుర్వేద రంగంలో స్వయంకృషితో ఎదిగి ఎంతో ప్రజ్ఞ సంపాదించి ఎంతోమందికి సేవలు చేసినందుకు గాను స్వర్ణ నంది అవార్డు అందుకోవడం పట్ల పలువురు ఆయన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో తోటి జర్నలిస్టులు పెంటం స్వామి, చరణ్ రాజ్, వేముల వేణు, సంతోష్ రెడ్డి, దయానంద్, జీకురు పరమేశ్వర్, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..