• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సంఘం-సిద్ధిపేట జిల్లా శాఖ..

Bypentam swamy

Oct 21, 2024

అక్షర న్యూస్ : తేది.21.10.2024 సోమవారం రోజున సిద్ధిపేట జిల్లా కేంద్రం ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సంఘం సిద్ధిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు అమ్మన చంద్రారెడ్డి అధ్యక్షతన జిల్లా కార్య నిర్వాహక సమావేశం జరిగింది. ఇట్టి సమావేశానికి జిల్లాలోని 11 మండల శాఖల అధ్యక్ష ,కార్యదర్శులు మరియు జిల్లా కార్యవర్గము హాజరైనారు. సంఘం అధ్యక్షులు అమ్మన చంద్రారెడ్డి తన అధ్యక్షోపన్యాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం (TSGREA) సమస్యల పట్ల ఏ విధంగా పోరాడుతుందో వివరించారు. పెండింగ్ లో యున్న ఐదు విడతల కరువు భృతి(DR) ని వెంటనే విడుదల చేయాలనీ,నగదు రహిత చికిత్స( EHS )విధి విధానాలను రూపొందించి వెంటనే అమలు చేయాలనీ,పి.ఆర్ సి.నివేదిక సమర్పించాలనీ తదితర ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలనీ ప్లభుత్వాన్ని కోరారు. అదే విధంగా మండల యూనిట్ల సమస్యలను పరిష్కరించుటకు కృషి చేస్తాననీ, ఎల్ల వేళల అందుబాటులో యుండి సమస్యల సాధనకు కృషిచేస్తానన్నారు. సంఘం ఉపాధ్యక్షులు యన్ కృష్ణమూర్తి సంఘ నివేదిక చదివి వినిపించారు. యన్ బాలయ్య ఆర్థిక నివేదిక ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు.నివేదికపై అన్ని మండలాల అధ్యక్షులు,కార్యదర్శులు చర్చించారు. సూచనలు సలహాలకు సమావేశ అధ్యక్షులు సమాధానము తెలిపారు. ఈ కార్యక్రమములో అమ్మన చంద్రారెడ్డి,బాలయ్య ,కృష్ణమూర్తి,నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.రాములు వందన సమర్పణతో
కార్యక్రమము ముగిసింది.

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..