బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామిఅక్షర న్యూస్ : ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షా బంధన్‌: సీఎం రేవంత్‌..అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామిఅక్షర న్యూస్ : ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షా బంధన్‌: సీఎం రేవంత్‌..
తెలంగాణ

అక్షర న్యూస్ : వృద్ద తల్లిదండ్రులను సరిగా చూసుకోని కొడుకులకు కౌన్సిలింగ్..

అక్షర న్యూస్ : వృద్ద తల్లిదండ్రులను సరిగా చూసుకోని కొడుకులకు కౌన్సిలింగ్..

అక్షర న్యూస్ : సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ టి. లక్ష్మీబాబు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట త్రీ టౌన్ పరిధిలోని ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన పాముకుంటా నర్సయ్య – ఎల్లవ్వ దంపతులు తమ ముగ్గురు కుమారులు యాదగిరి, కిష్టయ్య, దేవయ్యలకు తమ కష్టార్జిత ఆస్తులను సమానంగా పంచి ఇచ్చినప్పటికీ, సరైన పోషణ పొందడం లేదని 18-03-2026 నాడు సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టాటా లక్ష్మీబాబు ఈరోజు తేదీ 25-03-2026 నాడు ముగ్గురు కుమారులు మరియు వారి భార్యలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. సమాజంలో వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ ప్రతి కుమారుని ప్రాథమిక బాధ్యత అని, తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ, వారిని వృద్ధాప్యంలో ఆదరించడం, పోషణ ఇవ్వడం, ఆరోగ్య సంరక్షణ చూడడం కుమారుల కర్తవ్యమని వివరించారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం నైతికంగా తప్పే కాకుండా చట్టపరంగాను శిక్ష అర్హులని హెచ్చరించారు. కౌన్సిలింగ్ అనంతరం కుమారులు తమ తల్లిదండ్రులను ఇకపై సక్రమంగా చూసుకుంటామని, ప్రతి నెల ఖర్చులకు సరైన డబ్బులను అందిస్తామని, అలాగే ఆరోగ్య సమస్యలు వచ్చినపుడు అందరూ కలిసి వైద్యసహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

అక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..

ఈ సందర్భంగా స్టేషన్ ఇన్స్పెక్టర్ టాటా లక్ష్మీబాబు మాట్లాడుచు సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాళ్ గారు వృద్ధుల గురించి ప్రత్యేక దృష్టి సారించినందున వృద్దులైన తల్లిదండ్రులను సరిగా చూసుకోని కొడుకుల గురించి ఫిర్యాదు చేస్తే వారికి కౌన్సిలింగ్ నిర్వహించబడునని, వృద్ధుల పట్ల గౌరవం, సంరక్షణ మన సంస్కృతిలో భాగమని, ప్రతి కుటుంబం దీనిని కచ్చితంగా పాటించాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి ఖమ్మంపల్లి గ్రామానికి స్వయంగా వెళ్లి వృద్ధ దంపతుల పరిస్థితిని పరిశీలిస్తానని తెల్పినారు.

ఇన్స్పెక్టర్ గారి జోక్యంతో కుటుంబ వివాదం సఖ్యతగా పరిష్కారమవడంతో వృద్ధ దంపతులు పాముకుంటా నర్సయ్య-ఎల్లవ్వలు పోలీసుల సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..