• Fri. Jan 30th, 2026

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్ లో ముందస్తుగా మిమిక్రీ డే వేడుకలు..

Bypentam swamy

Dec 27, 2025

అక్షర న్యూస్ :సిద్దిపేట పట్టణం భారత్ నగర్ లోని శ్రీవాణి స్కూల్లో ఘనంగా మిమిక్రీ మరియు వెంట్రిలాక్విజం ప్రదర్శనలు నిర్వహించారు . ప్రముఖ మిమిక్రీ , వెంట్రిలాక్విజం కళాకారుడు వై.రమేష్ ,తమ అనుకరణ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ కార్యక్రమాన్ని మరింత రసవత్తరంగా మార్చారు. ప్రసిద్ధ కళాకారుల కంఠస్వరాలను, జంతువుల శబ్దాలను అద్భుతంగా అనుకరిస్తూ అందరినీ అలరించారు.
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సి.హెచ్ సత్యం మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసి, ఆత్మవిశ్వాసం పెంచే విధంగా ఈ కార్య‌క్ర‌మం నిలిచిందని తెలిపారు.అనంతరం పాఠశాల డైరెక్టర్ సి.హెచ్ సత్యం వై.రమేష్ ను శాలువా కప్పి , మెమెంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..