• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్ : శ్రీ రేణుకా మాత అమ్మవారిని దర్శించుకున్న సిద్దిపేట టూ టౌన్ సిఐ ఉపేందర్ దంపతులు..

Bypentam swamy

Dec 27, 2025

అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామంలో ఉన్న శ్రీ రేణుకా మాత అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని, పోలీసు ఉద్యోగంలో చేరినప్పటి నుండి విధినిర్వహణలో బిజీగా ఉండడం జరుగుతుంది కాబట్టి కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారని ఎందుకంటే వివిధ జిల్లాలలో ఉద్యోగరీత్యా పనిచేయడం వల్ల అమ్మవారి దర్శన భాగ్యాలు అన్నిచోట్ల చేసుకోవడం జరుగుతుందని అదేవిధంగా ఎన్నో మహిమలు ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కోరిన కోరికలు వరాలిచ్చే అమ్మవారిగా దర్శనమిస్తున్నారని చాలామంది భక్తులు చెప్పారని అందుకోసం గానే దర్శనం చేసుకోవడం జరుగుతుందని సిఐ దంపతులు తెలిపారు,అదేవిధంగా దుబ్బాక పట్టణ కేంద్రంలో ఉన్న శ్రీ బాలాజీ దేవాలయాన్ని దర్శించుకుని వెంకటేశ్వరుని ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగిందని వారు తెలిపారు. శ్రీ రేణుకా మాత ఆలయ కమిటీ, శ్రీ బాలాజీ దేవాలయం దుబ్బాక వారి ఆధ్వర్యంలో సీఐ దంపతులకు శాలువాతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని, కుంకుమ పసుపు, అమ్మవారి చీరను కానుకగా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అందజేయడం జరిగిందని ఆలయ కమిటీ తెలిపారు.. ఈ కార్యక్రమంలో శ్రీ రేణుకా మాత ఆలయ కమిటీ చైర్మన్ ఏల్పుల మహేష్, క్యాషియర్ కొండ్ర యాదగిరి, కార్యదర్శి నిమ్మ సంజీవరెడ్డి, దుబ్బాక ఏబీఎన్ రిపోర్టర్ దండు రాజు, రాళ్ల బండి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..