• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ : ములుగు జిల్లా గిరిజన యూనివర్సిటీకి స్థలం కేటాయింపు..

Bypentam swamy

Oct 20, 2024

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

అక్షర న్యూస్ : గిరిజనులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తేవడంలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ ఆలయ పరిసర ప్రాంతంలో గిరిజన యూని వర్సిటీ ఏర్పాటు కాన్నుది. ములుగు కేంద్రంగా ఏర్పాటయ్యే యూనివర్సిటీ రాష్ర్టానికే తలమానికం కానుంది. ఉమ్మడి రాష్ట్రం విభజన చట్టమైన సెక్షన్‌ 93 షెడ్యూల్‌13(3) ప్రకారం తెలంగాణకు వచ్చిన గిరిజన యూనివర్సిటీ అన్ని విధాలా సౌలభ్యంగా, సౌకర్యంగా ఉన్న ములుగు ప్రాంతంలో ఆవిష్కృతం కానుంది. ఈ నేపథ్యంలో గిరిజన యూనివర్సిటీకి తెలంగాణ ప్రభుత్వం ల్యాండ్ సెలక్ట్ చేసింది. ములుగులో 221 ఎకరాలు ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 26న జరిగే క్యాబినేట్ లో తీర్మానం చేయనున్నారు. ఆ తర్వాత సదరు భూమి కేంద్ర ప్రభు త్వానికి అప్పగించనుంది. దీంతో ఏళ్ల తరబడి పెండింగ్ లోని సమస్యకు చెక్ పడనున్నది. ఇక వేగవంతంగా పనులు.. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం గత కొన్నేళ్ల నుంచి స్థలం కేటాయించ లేదనే కారణంతో యూనివ ర్సిటీ ఏర్పాటుకు ఆలస్య మైందని కేంద్రం చెప్తూ వచ్చింది.దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క నేతృత్వం లో వివిధ దశల్లో సుదీర్ఘం గా అధ్యయనం తర్వాత స్థలం కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతోనూ ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఈ భూమి కేటాయింపును ఫైనల్ చేశారు. వాస్తవానికి గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు దాదాపు 500 ఎకరాల స్థలం అవసరం అవుతుందని గతంలో కేంద్రం పేర్కొన్నది. అయితే ఒకే చోట అంత అన్ని ఎకరాల భూమి సమ కూర్చడం కష్టమని, రెండు చోట్ల కేటాయించడం వీలవుతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరించింది. దీనికి చాలా ఏళ్ల తర్వాత అంగీకరించిన కేంద్రం, తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకునేం దుకు రెడీ అయింది.

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..