• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ : ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణలో నూతన ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం..

Bypentam swamy

Oct 20, 2024

అక్షర న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(TSUTF )సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో DSC -2024 నూతన ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ మరియు లీవ్ రూల్స్ పై అవగాహన సదస్సును ఈరోజు(20.10.2024) ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు సిద్దిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశాన్ని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి ఆన్లైన్లో ప్రారంభించి నూతన ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టిన సిద్దిపేట జిల్లా ఉపాధ్యాయులందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. బాధ్యత గల వృత్తిలోకి ప్రవేశించిన యువ ఉపాధ్యాయులు సుమారుగా 30 సంవత్సరాల పాటు సర్వీసు చేసే అవకాశం ఉన్నందున పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో అంకితభావంతో పనిచేసి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని కోరారు. అనంతరం సమావేశ ప్రధానవక్త టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏ వెంకట్ “ప్రభుత్వ పాఠశాలల పరిరక్ష-నూతన ఉపాధ్యాయుల పాత్ర “అనే అంశంపై సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో నిబద్ధతగల ఉపాధ్యాయ వృత్తిలో కి ఎక్కువమంది యువకులు రావడం స్వాగతించే అంశమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం 60 శాతం ప్రైవేటుపరమైందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అనేక సవాళ్లను ఎదుర్కొని పేద విద్యార్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పరిరక్షణలో టీఎస్ యుటిఎఫ్ అనేక సూచనలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న టీఎస్ యుటిఎఫ్ లో మీరందరూ సభ్యులు కావడం అభినందనీయమని అన్నారు. ఒకవైపు హక్కులకై పోరాటం చేస్తూ బాధ్యతాయుతంగా ప్రభుత్వ పాఠశాలలో అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉపాధ్యాయులకు సంబంధించిన తెలంగాణ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ మరియు లీవ్ రూల్స్ కు సంబంధించిన అంశాలను వివరంగా ఉపాధ్యాయులకు తెలియజేయడం జరిగింది.

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..