• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్ : స్లాటర్ హౌజ్ లో మాత్రమే మేకలను,గొర్రెలను వదించాలి..

Bypentam swamy

Oct 20, 2024

అక్షర న్యూస్ : కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు సానిటరీ ఇన్స్పెక్టర్ వనిత గారితో కలిసి పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో పర్యటించడం జరిగింది. ప్రజలకు శుచికరమైన, నాణ్యమైన మాంసాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో నిర్మించిన స్లాటర్ హౌజ్ లో మాత్రమే మేకలను వదించాలని అక్కడ డాక్టర్ లు ముద్ర వేసిన తర్వాతనే మాంసాన్ని మార్కెట్లో విక్రయించాలని మాంసం విక్రయదారులకు కమిషనర్ గారు సూచించారు. సిద్దిపేట శివారులోని ఇర్కోడ్‌ వద్ద 2 ఎకరాల స్థలంలో మాంసం విక్రయదారుల కొరకు అధునిక సౌకర్యాలతో నిర్మించిన స్లాటర్ హౌజ్ లో మాత్రమే మేకలను వదించాలన్నారు. కబేళాకు సులభంగా వెళ్ళుటకు మంచి CC రహదారులను వేయించటం జరిగిందని ,1.20 లక్షల సామర్థ్యం గల వాటర్‌ ట్యాంక్‌ను, చుట్టూ ప్రహరీ, మరుగు దొడ్లు ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయని కావున మాంసం విక్రయదారులు స్లాటర్ హౌజ్ లో మాత్రమే మేకలను,గొర్రెలను వధించి డాక్టర్ లచే ముద్ర వేపించుకొని విక్రయించాలని సూచించారు. ఆధునిక పద్ధ్దతిలో మాంసం వ్యర్థాలతో గ్యాస్‌ను ఉత్పత్తి చేసే ఇఫ్లూమెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ఏర్పాటుచేశామన్నారు.అధునిక పద్ధ్దతుల్లో నిర్మించిన స్లాటర్‌ హౌస్‌లో మాంసంగా మార్చే ప్రక్రియ కోసం తుప్పు పట్టని స్టీల్‌ సామగ్రితో పాటు గోడలకు టైల్స్‌ను ఏర్పాటుచేశారు. మాంసాన్ని నిల్వ చేసేందుకు ప్రత్యేకంగా ఫ్రీజర్‌ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..