అక్షర న్యూస్ : కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు LRS ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించి సమావేశం సమావేశం నిర్వహించారు. LRS 2020 (లేఅవుట్ రెగ్యులరైజేశన్ స్కీం) దరఖాస్తులు పూర్తి చేయుటకుగాను మొదటగా 4 లాగిన్ లు తీసుకోవటం జరిగిందని కానీ ఇట్టి 4 లాగిన్ ల ద్వారా ఆన్లైన్ చేయుటకు ఎక్కువ సమయం పట్టడం మరియు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో త్వరితగతిన పూర్తి చేయుటకు మరో 29 లాగిన్ లను ప్రత్యేకంగా క్రియేట్ చేపించటం జరిగిందని ప్రస్తుతం మొత్తం 33 లాగిన్ లను ఆన్లైన్ కొరకు క్రియేట్ చేయటం జరిగిందన్నారు. మొత్తం 32533 పెండింగ్ లో ఉన్నటువంటి దరఖాస్తులను ఒక్కొక్కరికి 1000 దరఖాస్తులను పూర్తి చేయుటకు గాను కమిషనర్ గారు అదేశించటం జరిగింది. ఎవరికైతే లాగిన్ లు వచ్చాయో వారందరితో సమావేశం నిర్వహించి అందరి ఫోన్ లలో యాప్ డౌన్ లోడ్ చేపించి యాప్ ద్వారా LRS దరఖాస్తులు ఆన్లైన్ చేయు విధానాన్ని వారికి సమావేశం ద్వారా వివరించటం జరిగింది. మరియు ఏదైనా సమస్య అనిపించినా సందేహాలు ఉన్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఆన్లైన్ చేయు సమయంలో ఎలాంటి స్థలాలను ఆన్లైన్ నమోదు చేయాలి ఎలాంటివి చేయకూడదు (అనగా నిషేధిత సర్వే నంబర్ స్థలాలు) అనే వివరాలు సైతం వారికి వివరించి ఆన్లైన్ చేయు వివరాల గురించి వారికి అవగాహన కల్పించటం జరిగింది. సమావేశంలో వందనం (CPO), నస్రీన్ భాను (TPO), స్రవంతి(TPS) గార్లు తదితరులు పాల్గొన్నారు.