అక్షర న్యూస్ :సిద్దిపేట పట్టణంలో ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినిలకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, గంజాయి ఇతర మత్తు పదార్థాలు, ఈవిటీజింగ్ నూతన చట్టాల గురించి అవగాహన కల్పించిన మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ.మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా మహిళల రక్షణకు పోలీస్ కమిషనర్ మేడమ్ గారి ఆదేశానుసారం ప్రత్యేక షెడ్యూల్లో భాగంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.సోషల్ మీడియా, సైబర్ నేరాలతో జాగ్రత్తగా ఉండాలి సైబర్ నేరాలు మన తప్పిదాల వల్లే జరుగుతున్నాయి గుర్తుతెలియని వ్యక్తులు పంపించే లింకులు ఓపెన్ చేయవద్దు, గూగుల్ పే ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించేటప్పుడు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, బ్యాంకు అధికారులు ఎవరూ మన వివరాలు ఎప్పుడు కూడా అడగరు, బ్యాంకు ఖాతా ఓకే ఓపెన్ చేసేటప్పుడే మన ఆధార్ కార్డు పాన్ కార్డు అన్ని వివరాలు ఐడి ప్రూఫ్ తీసుకొని మనకు అకౌంట్ ఇస్తారు, వాళ్లు ఎప్పుడు కూడా ఆ వివరాలు అడగరు, ప్రతి ఒక్కరూ ఇది గమనించాలి. ఇలా అడిగి ఎవరైనా ఫోన్ చేస్తే తప్పకుండా సైబర్ నేరమని వెంటనే ఆ ఫోన్ కట్ చేసి వచ్చిన నెంబర్ ను బ్లాక్ చేయాలి. ఫైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మీరు కానీ మీకు తెలిసిన వారు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే జాతీయ సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.షీటీమ్ దాని యొక్క ప్రాముఖ్యత నిర్వహించే విధుల గురించి, ఫోక్సో చట్టాలు మరియు బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాల గురించి, ఇవి టీజింగ్, గుడ్ టచ్, బాడ్ టచ్ తదితర అంశాల గురించి, సోషల్ మీడియా దాని యొక్క పరిణామాల గురించి, సైబర్ సెక్యూరిటీ, మైనర్ డ్రైవింగ్, డయల్ 100 ప్రాముఖ్యత, సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అనే అంశాల గురించి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్, మహిళల పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి, ఎవరైనా వేధించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డయల్ 100, లేదా సిద్దిపేట షీ టీమ్ నెంబర్ 8712667434 కాల్ చేసి సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ అస్మా ఫాతిమా, అధ్యాపకులు, సిద్దిపేట షీటీమ్ బృందం కిషన్, ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుళ్లు మమత, వీణకుమారి, కానిస్టేబుళ్లు ప్రవీణ్, లక్ష్మీనారాయణ. మరియు తదితరులు పాల్గొన్నారు.