అక్షర న్యూస్ : డాక్టర్ కొత్వాల్ దయానంద్ తెలంగాణ హోంగార్డ్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు హోంగార్డు రమణకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.పంజాగుట్ట ఏసిపి కార్యాలయంలో ఉద్యోగ వీధిని నిర్వహిస్తున్న హోంగార్డు రమణ గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ,ఆరోగ్య పరిస్థితి నీలాకడగలేక చాలీచాలని జీతంతో కుటుంబ బాధ్యతలు నెట్టుకుంటూ వస్తూ రోజుకి రోజుకి పెరుగుతున్న సమస్యలతో ఇంకెన్నాళ్లు ఈ బానిస బతుకు అని ఈ ప్రభుత్వంలోనైనా మారుతుందేమో అని అనుకొని, ఫస్ట్ 1 కొచ్చే జీతం ఎనిమిదో తారీకు లేదా పదో తారీకు తప్పితే 12వ తారీకు రావడంతో తీసుకున్న లోన్ కట్టలేక చెక్ బోన్సులైతూ ఉద్యోగ విధులలో ఎదురయ్యే సమస్యల దుర్భరమైన పరిస్థితికీ వెరెక్తి చెంది. గురువారం సాయంకాలం తన నివాసం (ఆత్మహత్య ) ఉరి వేసుకోవడం జరిగింది.తనకు ముగ్గురు చిన్నపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు” ఒక పిల్లవాడు ఉన్నారని తెలిసింది.
హోంగార్డు మిత్రుడు రమణ కు ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తు.హోంగార్డు రమణ ఆత్మహత్య ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికీ మనవి చేసారు..


