• Mon. Feb 3rd, 2025

అక్షర న్యూస్ : అర్హత కలిగి ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఆధునాతన కోర్సులలో అడ్వాన్స్ ట్రైనింగ్..

Bypentam swamy

Oct 18, 2024

అక్షర న్యూస్ :అర్హత కలిగి ఆసక్తి ఉన్న విద్యార్థులు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ లో ఆధునాతన కోర్సులలో ప్రవేశలకోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి తెలిపారు.శుక్రవారం హైదరాబాద్ నుండి కార్మిక,ఉపాధి కల్పన, శిక్షణ మరియు ఫ్యాక్టరీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ ఆ శాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్యతో కలిసి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కేంద్రాల్లో అడ్మిషన్స్ ప్రక్రియ నిర్వహణపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఐటిఐ ప్రిన్సిపాల్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి ఐడిఓసి కార్యాలయం నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పనే ధ్యేయంగా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కేంద్రాలు ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పనకు ఏటీసీ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఉపాధి ఉన్న కోర్సులను అధ్యయనం చేసి అడ్వాన్స్డ్ కోర్సులను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 31వ తేది వరకు అడ్మిషన్లు కు గడువు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటి ఫె్జ్ లో కుంకునూర్ పల్లి ఐటిఐ ని అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ గా మార్చి నూతనంగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్
కంట్రోల్ ఆటోమేషన్,
ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్,
ఆర్టిసన్ యుసింగ్ అడ్వాన్స్డ్ టూల్స్, బేసిక్ డిసైనర్ అండ్ వర్చ్యువల్ వెరిఫైర్ (మెకానికల్),
అడ్వాన్స్డ్ సిఎన్సి మేషనింగ్
టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ వంటి ఆరు అధునాతన కోర్స్ లను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. యువతకు వృత్తిపరమైన అవకాశాలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బహుళ సంస్థల్లో ఉపాధి కల్పనకు ప్రభుత్వం అధునాతన శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ శిక్షణ కేంద్రాలు వృత్తి శిక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయని 10వ తరగతి ఆపై విద్యార్హతలు ఉన్న విద్యార్థులకు అడ్మిషన్లు జరుగుతున్నట్లు తెలిపారు.
ఈ కేంద్రాల్లో నిర్వహించబడే శిక్షణ కార్యక్రమాలు విద్యార్థులకు ప్రాథమిక ఆవశ్యకతల నుంచి ప్రారంభించి ప్రొఫెషనల్ స్థాయికి చేరేవిధంగా శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. దరఖాస్తు చేయుటకు చివరి తేదీ ఈ నెల 31 వరకు పొడిగించినట్లు తెలిపారు. అర్హత కలిగి ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ లో ఆధునాతన కోర్సులలో ప్రవేశలకోసం దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఉపాధికల్పనాధికారి రాఘవేందర్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నార..

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..