అక్షర న్యూస్ :ఈ సందర్భంగా సిద్దిపేట ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు ప్రజాప్రతినిధులు వారి యొక్క ఇష్టానుసారంగా ఎలాంటి ప్రభుత్వం అనుమతి లేకుండా వారి సొంత వాహనాలకు పోలీస్ సైరన్ బిగించుకుని తిరుగుతూ తిరుగుతున్నారు. పోలీస్ కమిషనర్ మేడమ్ గారి ఆదేశానుసారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తీసివేయడం జరిగింది. ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణంలో ఉన్న కారు డెక్కర్ షాప్ యజమానులతో మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వం అనుమతి లేకుండా ప్రైవేటు వాహనాలకు పోలీస్ సైరన్ బిగించవద్దని సూచించారు. ఎవరైనా సైరన్ బిగించమని ఇబ్బంది పెడితే వెంటనే ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పోలీసులకు తెలియకుండా ఎవరైనా సైరన్ బిగిస్తే షాపు యజమానిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


