అక్షర న్యూస్ : కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.31 వార్డులోని నాసార్ పుర లో చెత్త వాహనం సరైన సమయానికి రావడం లేదన్న ఫిర్యాదు మేరకు కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు నేరుగా సంబంధిత ప్రాంతానికి వెళ్లి వార్డు సానిటరీ ఇన్స్పెక్టర్,జవాన్, చెత్త వాహనం డ్రైవర్ లని పిలిపించి తప్పనిసరిగా ప్రతిరోజు చెత్త వాహనం సమయానికి రావాలని ఆదేశించారు. సమయానికి చెత్త వాహనం రాకపోవడం వలన గృహనివాసతులు ఇంట్లో వెలువడినటువంటి చెత్తను బహిరంగ ప్రదేశంలో వేసే అవకాశం ఉంటుందని కావున తప్పనిసరిగా ప్రతి ఇంటింటి చెత్త సేకరణ జరగాలన్నారు.అనంతరం ఇందిరమ్మ కాలనీలో పారిశుధ్య సమస్యలు నన్ను ఫిర్యాదు మేరకు కమిషనర్ గారు వెళ్లి పరిశీలించడం జరిగింది. ఉరికి కాలువ నుండి దుర్వాసన వస్తుందని కమిషనర్ గారి దృష్టికి తీసుకురాగా వెంటనే ఇళ్ల వద్ద ఉన్న మురికి కాలువలోని చెత్త ,సిల్ట్ తొలగించి మురికి కాలువల పైన ఉన్నటువంటి స్లాబ్ నిర్మాణం వలన మురికి కాలువలో నిలువైనటువంటి చెత్తను,సిల్ట్ ను తొలగించుటకు సమస్యగా ఉంటుంది కాబట్టి స్లాబ్ నిర్మాణాలు తొలగించాలని సానిటరీ ఇన్స్పెక్టర్ గారిని ఆదేశించారు. ఇంట్లో ఉన్నటువంటి పేపర్లు ,కవర్లను బహిరంగ ప్రాంతాల్లో వేయడం వలన అది గాలికి మురికి కాలువలో పడి నీటి సరఫరా కు సమస్యను కలిగిస్తాయని కావున ఇళ్లలో వెలుపడేటువంటి చెత్తను బహిరంగ ప్రాంతాల్లో వేయకుండా ఉదయాన్నే వచ్చే మున్సిపల్ వారి చెత్త వాహనానికి అందజేయాలని కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. అనంతరం కుశాల్ నగర్ లో ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు, చీదు తొలగించాలని సానిటరీ ఇన్స్పెక్టర్ ని ఆదేశించారు.