• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ : నర్సంపేటలో మహనీయుడు జ్యోతిబాపూలే కు ఘనంగా పుష్పాభిషేకం

Bypentam swamy

Oct 16, 2024

అక్షర న్యూస్ :తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన ప్రక్రియను ప్రారంభించాలని జీవో నెంబర్ 18ని విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం రోజున నర్సంపేట పట్టణంలో నీ జ్యోతిబాపూలే ప్రాంగణము వద్ద వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా పూలతో పుష్పాభిషేకం చేశారు. అనంతరం డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మేము అధికారంలోకి వస్తే సమగ్ర కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇవ్వడంతో తెలంగాణలో బీసీలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగిందని డ్యాగల శ్రీనివాస్ అన్నారు. దానికి అనుగుణంగానే జీవో నెంబర్ 26 ను తీసుకొచ్చి సమగ్ర కులగనన చేపట్టడానికి 150 కోట్ల బడ్జెట్ ను కూడా విడుదల చేసి తొమ్మిది నెలలు గడుస్తున్న కులగణన పట్ల ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ మిలియన్ మార్చ్ కు పిలుపునిచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో రాష్ట్ర ప్రభుత్వం పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో చర్చలు జరిపించి అతి త్వరలో సమగ్ర కులగణన చేపడతామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి కుల గణనకు అనుగుణంగా జీవో నెంబర్ 18ని విడుదల చేస్తూ కమిటీని ఏర్పాటు చేయడంతో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపుమేరకు నర్సంపేట పట్టణంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి పూలు పూలమాలు వేసి ఘనంగా పుష్పాభిషేకం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నందగిరి రజనీకాంత్, గాదెగొని బిక్షపతి గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు మద్దెల శ్యాం కుమార్ యాదవ్, గట్టు ఆనంద్ కుమార్, పట్టణ కార్యదర్శి ఓడపల్లి రమేష్, మండల నాయకులు కందికొండ కుమార్, షేర్ల శ్రీనివాస్, బండి కొమురయ్య, గండ్రాతి శ్రీనివాస్, సామల సత్యం, దీకొండ హేమసుందర్, శీరంశెట్టి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..