• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ : నిరుద్యోగులను మోసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే..

Bypentam swamy

Oct 20, 2024

అక్షర న్యూస్ :10 సంవత్సరాల కెసిఆర్ ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలను ఇవ్వకుండా మోసం చేశారని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలలో అన్ని వర్గాలను కెసిఆర్ మోసం చేశారని ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. నిరుద్యోగులు కష్టపడి చదివితే కేసీఆర్ ప్రభుత్వంలో పేపర్ లీకులు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తులను నట్టేట ముంచారు అని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వంలోకి మరోసారి రావాలని ఉద్దేశంతో అందరి ఫోన్లు టాపింగ్ చేసి నీచమైన రాజకీయానికి పాల్పడ్డాడని అన్నారు. త్వరలోనే పేపర్ లీకులు ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ బడా నేతలు జైలుకు వెళ్లడం ఖాయం అని అన్నారు. 10 సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని లక్షల కోట్లకు పైగా దోచుకుతిన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డి పై అసత్య ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు అని అన్నారు. మీలాగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తుందని అందుకు అన్ని వర్గాల వారు బీఆర్ఎస్ అద్దపు మాటలు నమ్మవద్దు అని అన్నారు. 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ పార్టీ చేయని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలల్లో చేస్తే ఓర్వలేక సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శించడం తగదు అని అన్నారు.

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..