అక్షర న్యూస్ :76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయాన్నే ఎనిమిది గంటలకు పట్టణంలోని లాల్ కమాన్ పైన చైర్ పర్సన్ కడవెరుగు మంజుల రాజనర్సు గారు వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు గారితో మరియు కౌన్సిల్, కో సభ్యులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉదయాన్నే 8:20 నిమిషాలకు పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. లో లెవల్ వాటర్ ట్యాంక్ లో సైతం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలలో కమిషనర్ గారు పాల్గొన్నారు. పొడిచెత్త సేకరణలో అత్యధిక ప్రతిభ కనబరిచినటువంటి పారిశుద్ధ కార్మికులకు ప్రశంస పత్రం అందజేసి సన్మానించడం జరిగింది.