అక్షర న్యూస్ : తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్స్ గౌరవ అధ్యక్షులు తాండూరు శాసనసభ్యులు మన్యశ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి సార్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారికి నూతన సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుటకు రాష్ట్ర సంఘం ప్రతినిధి కొత్వాల్ దయానంద్ గురుస్వామి గారిని కల్పించడంతో స్వామి గారు తెలంగాణ హోంగార్డ్స్ సమస్యలపై వివరించడం జరిగింది.
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు సానుకూలంగా స్పందించారు.అతి తొందరలోనే హోంగార్డలా కుటుంబాలతో భారీ ఎత్తున పిలుపునిచ్చి పెద్ద సభ ఏర్పాటు చేసి”
ఆ సభలో హోంగార్డ్స్ తీపి కబురు వచ్చే విధంగా చేయాలని అనుకుంటున్నాను అని అన్నారు డాక్టర్ కొత్వాల్ దయానంద్ గురుస్వామి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ కుమార్, శివ నారాయణ, సాయిరాం, శివ రాజ్ పాల్గొన్నారు.