అక్షర న్యూస్ : సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు నెల రోజులుగా వారి సమస్యల పరిష్కారం కోసం సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట చేస్తున్న సమ్మెకు సోమవారం పి.డి.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ సంఘీభావం తెలిపి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగస్తులను క్రమబద్ధీకరించాలని మరియు వారికి సమాన పనికి సమాన వేతనం మరియు పే స్కేల్ మరియు జీవిత , ప్రమాద బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను పి.డి.ఎస్.యు బలపరుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో PDSU సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గ్యార గణేష్,జిల్లా సహాయ కార్యదర్శి ఆనంద్,జిల్లా నాయకులు శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.