బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్ : పెండింగ్ లో ఉన్నా ఇరిగేషన్ కెనాల్స్ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి..

అక్షర న్యూస్ : పెండింగ్ లో ఉన్నా ఇరిగేషన్ కెనాల్స్ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి..

అక్షర న్యూస్ :దుబ్బాక శాశనసభ నియోజకవర్గం పరిధిలో పెండింగ్ లో ఉన్నా ఇరిగేషన్ కెనాల్స్ నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తో కలిసి దుబ్బాక నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ కెనాల్స్ నిర్మాణం, భూసేకరణ పై ఇరిగేషన్, రెవిన్యూ, ఫారెస్ట్ అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు మరియు ఇతర మెయిన్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణ పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించి నిర్మాణం పూర్తి చేయాలన్నారు.

అలాగే కాల్వల నిర్మాణానికి అవుసరమైన పెండింగ్ లో ఉన్న భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ను ఆదేశించారు. అలాగే ఇరిగేషన్,రెవిన్యూ, పోలీస్, సర్యే అధికారులు చెరువులను పరిశీలించి చెరువశిఖంలో పంటలు వేయకుండా చూడాలన్నారు.

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..

అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి దుబ్బాక నియోజకవర్గంలో వంగిన కరంట్ పోల్స్, వంగిన వైర్స్, చెడిపోయిన ట్రాన్సఫర్మర్స్ ను పరిశీలించి సరిచేయాలన్నారు.

ఈ సందర్బంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయం పై ఆధారపడి ఉన్నదని నియోజకవర్గంలోని రైతులకు ఇబ్బంది కలుగకుండా సాగునీరు సరఫరా చెయ్యాలని అదేవిదంగా రైతులకు మరియు ప్రజలకు ఇబ్బంది కలుగకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ వ్యవసాయానికి మరియు విద్యా సంస్థలకు, ఆసుపత్రులకు, గ్రామపంచాయతీలకు మరియు గృహలకు అందించాలని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, కాళేశ్వరం ప్రాజెక్టు యూనిట్ 1 స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ గీత, ఇరిగేషన్ ఇఇ నారాయణ, ఎస్ఇ ఎలక్ట్రీసిటీ చంద్రమోహన్, డిఇ లు, ఏఇ లు తదితరులు పాల్గొన్నారు.