• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ : జిల్లాలో పరిష్కారం కోసం విచ్చేసిన ప్రజల నుండి మొత్తం 49 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు..

Bypentam swamy

Dec 30, 2024

అక్షర న్యూస్ : 

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అన్నారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తమ సమస్యల జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి జిల్లా కలెక్టర్ వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చేసి అందజేసిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిఅర్హతల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాలో పరిష్కారం కోసం విచ్చేసిన ప్రజల నుండి మొత్తం 49 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.ప్రజావాణి అనంతరం 31 వ బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో జాతీయ స్థాయికి ఎన్నికైన మర్కుక్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధామరకుంట గ్రామానికి చెందిన విద్యార్థులు ఆశ్వంత్ మరియు కార్తీక్ చారి 31 వ బాలల సైన్స్ కాంగ్రెస్ లో పాల్గొనడానికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో జరిగే సైన్స్ కాంగ్రెస్ లో పాల్గొంటారు. యశ్వంత్ మరియు కార్తిక చారి నీ జిల్లా కలెక్టర్ అభినందించారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రాజెక్టు గురించి చెబుతూ శీతల పానీయాల డబ్బాల నుండి తీసినటువంటి సన్నటి దారాన్ని వ్యవసాయ క్షేత్రాలకు పెన్సింగ్ చేసుకోవడానికి అదేవిధంగా గృహపకరణాలు మంచాలు, కుర్చీలు, ఫ్రీ గార్డ్స్ అదేవిధంగా శుభ్రం చేసే పరికరాలను తయారు చేయడానికి ఉపయోగించుకుంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నాగ రాజమ్మ, డిఆర్డిఎ పిడి జయదేవ్ ఆర్యా మరియు ఇతర శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొ

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

న్నారు.

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..