అక్షర న్యూస్ :సిరిసిల్లలోని గణేష్ నగర్ కు చెందిన కోడం హరికిషన్ కొడుకు కు బోన్ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నాడు. తమ కుమారుడిని ఆదుకోవాలని బాలుడి తండ్రి సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి గారికి విన్నవించడం జరిగింది.వెంటనే వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి గారు స్పందించి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది.ఆది శీను గారు త్వరగా స్పందించి జిల్లా కలెక్టర్ అయిన శ్రీ సందీప్ కుమార్ జా గారి దృష్టికి తీసుకువెళ్లారు .దీంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారు స్పందించి రూ.ఒక లక్ష 42 వేల చెక్కు మంజూరు చేయగా, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
దీనితో బాలుడు తండ్రి కోడం హరికిషన్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్ గారికి, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూపా తిరుపతి రెడ్డి గారికి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ శ్రీ సందీప్ కుమార్ జా గారికి కృతజ్ఞతలు తెలిపారు.