అక్షర న్యూస్: విలేకరుల వృత్తి, సమాజంలోని అత్యంత గౌరవనీయమైన మరియు ప్రజాస్వామ్యవ్యవస్థలో కీలకమైనది. వారు సత్యాన్ని ప్రజలకు చేరవేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తారు. కానీ, నేడు అధికారుల అవినీతి, రాజకీయ నాయకుల ప్రలోభాలు విలేకరుల వృత్తి నిజాయితీకి మరియు గౌరవానికి పెద్ద ముప్పుగా మారుతున్నాయి. కొన్ని ప్రభుత్వ శాఖలలో, ముఖ్యంగా రెవెన్యు సబ్ రిజిస్టర్ ఆర్టీఏ ఆఫీస్, ఇరిగేషన్, మైనింగ్, ఎక్సైజ్ వంటి శాఖలలో నిత్యం అవినీతి రాజ్యం ఎలుతుంది. అధి జగమెరిగిన సత్యం.కానీ పండుగల పేరుతో విలేకరులకు కానుకలు ఇవ్వడం, వారి పనిలో నిస్సహాయత కలిగించడానికి అధికారులు ప్రయత్నం చేయడం ఒక ఆచారంగా మారింది. దసర దీపావళి సంవత్సరం లో ఒకసారి ఇంతే కొంత కనుక.. అట్టున్నారు. ఈ కనుకులె అవినీతికి మూలలు.. విలేకరులు ఈ అనైతిక కార్యకలాపాలకు లొగ్గన రేపటి సమాజం స్ఫూర్తిదాయకంగా ఉండదు..
అవినీతిని కప్పిపుచ్చే కుట్రలు:
ఈ అధికారుల ప్రలోభాలు, అవినీతి చర్యలను మీడియా కప్పి పెట్టడం కోసం ఒక మార్గంగా పండుగ ల పేరున చందాలు మారాయి. విలేకరులు తమ వృత్తి నైతికతను కోల్పోతూ, ప్రభుత్వ వైఫల్యాలను దాచిపెట్టడంలో పాలుపంచుకుంటున్నారు. ఈ చర్యలు జర్నలిజం రంగంలో సమాజానికి నిజం తెలియకుండా చేసే ప్రయత్నంగా ఉంటాయి. విలేకరులను వశపరచుకోవడానికి పండుగల పేరుతో ప్రలోభాలు ఇవ్వడం, కానుకలు పంపించడం, వారి నిజాయితీని కొనుగోలు చేయడమే ఈ కుట్రల ముఖ్య ఉద్దేశం.
విలేకరుల వృత్తి సమాజానికి సంకేతం:
సమాజంలో జర్నలిజం ఒక బాధ్యతాయుతమైన వృత్తిగా భావించబడుతుంది. ఇది ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడంలో, వారి హక్కులను పరిరక్షించడంలో కీలకమైనది. అధికారుల తప్పిదాలను, వారి అవినీతి చర్యలను బయట పెట్టడంలో విలేకరులు సమాజంలో మార్పుకు కారకులు కావాలి. కానీ, కొంతమంది విలేకరులు ఈ అనాగరిక మైయిన ప్రలోభాలకు లొంగ, కండి లొంగిన వారి వృత్తి పరిమితిని కోల్పోతున్నారు. ఇది విలేకరుల వృత్తి పట్ల ఉన్న గౌరవాన్ని దెబ్బతీస్తుంది. సంస్థలు జీతాలు ఇవ్వడం లేదు అదే సాకుగా చూపకండి. నిస్వార్థ సేవకుడు విలేకర్లు. అప్పుడే అవినీతి అధికారి గుండెల్లో రైళ్లు పరుగెడ్ తాయి.
విలేకరుల ప్రాముఖ్యతను గుర్తించి వృత్తి గౌరవాన్ని నిలబెట్టదాం:
జర్నలిజం వృత్తి, నిజాయితీతో కూడిన ఒక పరిశుద్ధమైన పన్నాగం. విలేకరులు పత్రికా స్వేచ్ఛను ఉపయోగించి అవినీతి అధికారుల భారతం పట్టాలి, సమాజానికి నిజమైన సమాచారం ఇవ్వడమే బాధ్యత గా భావించాలి. విలువైన సమాచారం అందించడం ద్వారా సమాజంలో కీలక మార్పు తీసుకురావాలి. నిజాయితీ విలేకరులు, వారి బాధ్యతను నిజాయితీతో నిర్వహిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తారు. ప్రజల్లో ఆదరణ ఎప్పటికీ కలిగి ఉంటారు.
విలేకరులకు సత్యం మార్గమే కర్తవ్యం::
విలేకరులు సత్యం చెప్పడంలో విశ్వాసం ఉంచాలి. అధికారుల ప్రలోభాలు లేదా రాజకీయ నాయకుల తప్పుడు ఆచారాలకు లొంగకుండా, తమ వృత్తి గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. అలా చేయడం ద్వారా వారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో, సమాజానికి నిజమైన మార్గదర్శకులుగా నిలుస్తారు.
ఫలితం:
ఇలాంటి పరిస్థితుల్లో, జర్నలిజం సంఘాలు మరియు విలేకరులు సమాజాన్ని అవినీతి నుండి రక్షించడానికి మరింత కృషి చేయాలి. వృత్తి గౌరవాన్ని పెంచడానికి, విలేకరులు నిజాయితీ, నైతికతను నిలబెట్టుకోవాలి.
హైలైట్స్:
1. పండుగల పేరుతో విలేకరులకు ప్రలోభాలు – అవినీతి కప్పిపుచ్చే మార్గం.
2. సబ్ రిజిస్టర్ ఆర్టీఏ కార్యలయం లో జిల్లా అధికారి వింత ఆచారం. రాష్ట ప్రభుత్వం విలేకరుల వృత్తి విలువ తో కుదుకుంది. రాష్ట ముఖ్యమంత్రి సైతం విలేకరులు గౌరవిస్తున్నారు.సంగారెడ్డి జిల్లా లో పంచాయితీ రాజ్ అధికారి 500 వందల 1000 పండుగ ఖర్చులకు విలేకరులు తీసుకోండి లేదంటే వెళ్లి పొండి ఆంటు దబయింపులు.అతిని అవినీతి ఇంత అంత కాదు మైండ్ బ్లాక్ కావాల్సిందే.. అలాoటి అధికారులు కలం తో నిగ్గు తేల్చాలి.ఆఫీస్ తో ఇరిగేషన్, మైనింగ్,అధికారులు వెక్కిలి మాటలు ఎక్సైయిజ్ మందుగ్ బాటిల్ తో సర్దిపాటు ఇదెక్కడి ఆచారం అంటే ఈ శాఖల్లో ఇంతే అంటూ సమాధానాలు.ఈ ఆచారం సర్వ సాధారణం.
3. విలేకరుల వృత్తి గౌరవాన్ని నిర్వీర్యం చేసే ప్రభుత్వ అధికారుల కుట్రలు. భా ద్యత కలిగిన విలేకరిగా ఉండండి. వృత్తి విలువ పెంచు కొండి. అవినీతి అధికారుల భారతం పట్టండి.
4. నిజాయితీ విలేకరులు సమాజానికి మార్గదర్శకులు కావాలని వృత్తి సంఘాల ఆవేదన.
5. సత్యాన్ని బహిర్గతం చేయడం విలేకరుల కర్తవ్యం, ప్రజాస్వామ్య పరిరక్షణలో వారి బాధ్యత.
6. ప్రలోభాలకు లొంగకుండా విలేకరులు సత్యసంధతను నిలుపుకోవడం సమాజం కోసం కీలకం.