అక్షర న్యూస్ : తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి హరీష్ రావు గారు దసరా శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ సాంస్కృతిక జీవనవిధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు నిత్య విజయాలు కలగాలని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండగల్లో దసరా ఒకటి. తెలుగు ప్రజలకు దసరా అతిపెద్ద పండగ. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో దసరా పండగ సందడి మొదలైంది దసరా రోజున కుటుంబంలోని సభ్యులందరూ ఒకే చోట చేరి సామూహికంగా సంబురాలు జరుపుకోవడం తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు.శమిపూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్ బలాయ్ తీసుకోవడం.. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం.. తెలంగాణ ప్రజలందరికీ సుఖసంతోషాలను ప్రసాదించాలని దుర్గామాతను ప్రార్థించారు.