• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ : అంబేద్కర్ గొప్ప సమాజ నిర్మాణ స్థాపకుడు..

Bypentam swamy

Dec 6, 2024

అక్షర న్యూస్ :అంబేద్కర్ గొప్ప సమాజ నిర్మాణ స్థాపకుడు అని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తూ ఇమామ్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సిద్దిపేటలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తూ ఇమామ్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు అత్తూ ఇమామ్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కొందరివాడు ఓ ఒక్క వర్గానికో సొంతం కాదు అని ఆయన అందరివాడు అని అన్నారు.

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రచించి ప్రజల అవసరాలు హక్కులను తెలిపిన మహా నాయకుడు అని అన్నారు. ప్రజలకు రిజర్వేషన్లు హక్కులు కల్పించడమే కాకుండా విధులను కూడా సూచించారు అని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పల్లె తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం దళితుల అభివృద్ధికి పాటుపడిన గొప్ప వ్యక్తి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి మెంబర్ దరిపల్లి చంద్రం, కౌన్సిలర్ షాకీ ఆనంద్ ,రియాజుద్దీన్, ఆలకుంట మహేందర్, గయాజుద్దీన్, తప్పేట శంకర్, గేదహరి మధు ,ఫయాజ్, అనిల్ ,తదితరులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..