• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ : శుక్రవారం సాయంత్రం కోహెడ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ పర్యటనలు…

Bypentam swamy

Dec 6, 2024

అక్షర న్యూస్ :కోహెడ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.

కిచెన్ షెడ్ ను పరిశీలించారు. కిచెన్ కూరగాయలను మరియు స్టోర్ గదిలో బియ్యం పప్పులు ఇతర వంట సామాగ్రి పాడవకుండా సెప్టి మెదడ్స్ పాటించాలని సూచించారు. కాలం చెల్లిన సరుకులు మరియు బియ్యం నాణ్యత లో ఎలాంటి రాజి పడవద్దని తెలిపారు. ఎట్టి పరిస్థితిలో మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని అలాగే విద్యార్థులకు రుచికరంగా వండాలని సిబ్బందికి తెలిపారు. అన్నం కూరగాయలు మరియు మెను ప్రకారం మంసాహరం కూడా అందించాలని తెలిపారు. అలాగే వండిన ఆహారాన్ని విద్యార్థులు తప్పకుండా అందరూ తీనాలి.

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

వంటలో ఎలాంటి పోరపాట్లు రాకుండా వంట సిబ్బంది కి విద్యార్థులకు భోజనం మరియు చదువు విషయంలో ఎలాంటి చిన్న సమస్య ఎదురైన వెంటనే పరిష్కారించాలని ప్రిన్సిపల్ ఇతర అధికారులను ఆదేశించారు.
ఈ గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ వెంకట రామిరెడ్డి 575 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అందిస్తున్నామని తాగునీటి కొరత, బాత్రూంలో చిన్న చిన్న రిపేర్లు డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేదని కలెక్టర్కు తెలిపారు.

తాగునీటి కొరకు మరియోక సంపు నిర్మాణం కొరకు ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వచ్చి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటారని అలాగే బాత్రూంలో డ్రైనేజీ వ్యవస్థ ఇతరత్రా ఎలాంటి అవసరం ఉన్న ఈడబ్ల్యూఐడి సి అధికారులు వచ్చి అన్నింటికీ రాసుకొని ఎస్టిమేట్స్ సిద్ధం చేస్తారని తెలిపారు. మైదానంలో ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ పార్మర్ వల్ల విద్యార్థులు ఆడుకోడానికి ఇబ్బందిగా ఉందని తెలుపగా విద్యుత్ అధికారులు పంపించి దాని చుట్టూ ఫినిషింగ్ వేసేలా చర్యలు తీసుకుంటారని జిల్లా కలెక్టర్ తెలిపారు.

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..

కోహెడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లా కలెక్టర్ సందర్శించి ఈ పాఠశాలలో కొత్తగా ఏర్పాటు చేయబోయే కంప్యూటర్, రోబోటిక్, సైన్స్, ఇంగ్లీష్ ల్యాబ్ లను అవసరమైన గదులను సిద్ధం చేయాలని ఏజెన్సీ వారికి అందివ్వాలని పాఠశాల ప్రిన్సిపల్ కి తెలిపారు.