అక్షర న్యూస్ :ప్రజాపాలన విజోత్సవాల వేడుకలలో భాగంగా కమిషనర్ అశ్రిత్ కుమార్ గారి ఆదేశాల మేరకు సానిటరీ ఇన్స్పెక్టర్లు పట్టణంలో పలు కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.
రెసిడెన్షియల్ బ్రిడ్జ్ పాఠశాలలోని విద్యార్థులకు నిత్యం ప్రతిరోజు ఇంట్లో వెలువడేటువంటి తడి ,పొడి, హానికర చెత్తగా వేరు చేయు విధానాన్ని అవగాహన కల్పించారు. సిద్దిపేట పట్టణంలో తడి చెత్త ద్వారా తయారవుతున్నటువంటి కేంద్రం ఎరువు తయారీ విధానం, బయో గ్యాస్ వంటి వాటిపై సైతం అవగాహన కల్పించారు.
ఎర్ర చెరువు కట్టపైన పిచ్చి మొక్కలు ,చెత్త తొలగించడం జరిగింది. చెరువులో ఉన్నటువంటి చెత్తను, గుర్రపు డెక్కను తొలగించడం జరిగింది.