• Sun. Dec 7th, 2025

అక్షర న్యూస్ : దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి..

Bypentam swamy

Oct 11, 2024

అక్షర న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయదశమి పేరుతో దేశవ్యాప్తంగా జరుపుకుంటారని పేర్కొన్నారు. దసరా రోజున కుటుంబంలోని సభ్యులందరూ ఒకేచోట చేరి సంబురాలు జరుపుకోవడం తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు.శమీపూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్ బలాయ్ ఇస్తారని, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారని గుర్తు చేశారు. శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమని తెలిపారు. తెలంగాణకు నిత్య విజయాలు కలగాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలను ప్రసాదించాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.

అక్షర న్యూస్: 63వ జాతీయ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..

అక్షర న్యూస్: పాలమాకుల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ కె. హైమావతి..