• Tue. Feb 4th, 2025

అక్షర న్యూస్ : తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్..

Bypentam swamy

Oct 11, 2024

అక్షర న్యూస్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మ‌నిషి త‌న‌లోని చెడు మీద నిత్యం పోరాటం చేస్తూ మంచి దిశ‌గా విజ‌యం సాధించాల‌నే జీవ‌న తాత్విక‌త‌ను విజ‌య ద‌శ‌మి మ‌న‌కు తెలియ‌జేస్తుంద‌న్నారు. ద‌స‌రా రోజు శుభ‌సూచ‌కంగా పాల‌పిట్ట‌ను ద‌ర్శించి శమీ వృక్షానికి పూజ చేసి, జ‌మ్మి ఆకును బంగారంలా భావించి పెద్ద‌ల‌కు స‌మ‌ర్పించుకుని వారి ఆశీర్వాదం తీసుకోవ‌డం ఆచారమని గుర్తు చేశారు.తెలంగాణ ప్ర‌జ‌ల జీవితాల్లో ద‌స‌రా పండుగ‌కు ప్ర‌త్యేక స్థానం ఉందని, అలాయ్ బ‌లాయ్ తీసుకుని ప‌ర‌స్ప‌ర ప్రేమాభిమానాల‌ను పంచుకోవ‌డం ద్వారా ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల నడుమ సామాజిక సామ‌ర‌స్యం పరిఢవిల్లుతుందన్నారు.

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..