• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్ : దసరా శుభాకాంక్షలు తెలిపిన సంఘసంస్కర్తలైన డాక్టర్ కొత్వాల్ దయానంద్,డాక్టర్ రొండ మల్లారెడ్డి మరియు డాక్టర్ పెంటం స్వామి గారు…

Bypentam swamy

Oct 11, 2024

అక్షర న్యూస్ : విజయ దశమి, దసరా పండుగ సందర్భంగా ప్రజలకు వివిధ సంఘాల సంఘసంస్కర్తలైన డాక్టర్ కొత్వాల్ దయానంద్,డాక్టర్ రొండ మల్లారెడ్డి,డాక్టర్ పెంటం స్వామి గారు శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక, విశిష్ట స్థానం ఉందన్నారు.విజయానికి ప్రతీక అయిన విజయ దశమి పేరుతో దేశవ్యాప్తంగా ప్రజలు దసరా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులందరూ కలిసి పండుగ జరుపుకోవడం అన్ని వర్గాల ప్రజల మధ్య ఐక్యతను ప్రదర్శిస్తుంది.ఇండియన్ రోలర్ ( పాల పిట్ట ) దర్శనం , పూజలు సమర్పించడం మరియు జమ్మిచెట్టుకు ఆచార పూజలు చేయడం , దాని ఆకులను అలయ్ బలాయిలో మార్చుకోవడం మరియు పెద్దల నుండి ఆశీర్వాదం తీసుకోవడం రాష్ట్రంలో దసరా ఉత్సవాలలో విశిష్టమని వారు అన్నారు.విజయదశమి స్ఫూర్తిని వారు అన్ని సంగాలల్లో కొనసాగిస్తామన్నారు, సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు వారు కృషి చేస్తామని పునరుద్ఘాటించారు. ప్రజలకు దుర్గామాత ఆశీస్సులు కావాలని వారు ఆ దుర్గా దేవిని ప్రార్థించారు..

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

అక్షర న్యూస్ :ఆధ్యా ఐ కేర్ సేవలు అభినందనీయం ..