• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్ : సిరిసిల్ల టూ సిద్దిపేట ఫోర్లేన్కు గ్రీన్సిగ్నల్..!!

Bypentam swamy

Nov 11, 2024

అక్షర న్యూస్ :సిద్దిపేట మార్గంలో సిరిసిల్లవాసులకు రోడ్లపై టర్నింగ్ కష్టాలు తీరనున్నాయి. సిరిసిల్ల టూ సిద్దిపేట వరకు ఫోర్‌ లేన్‌ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌ వెళ్లాలంటే సిద్దిపేట రోడ్డే దిక్కు. సిరిసిల్ల నుంచి సిద్దిపేట వరకు 36 కి.మీ దూరంలో 25చోట్ల డేంజర్‌ మలుపులు ఉన్నాయి.

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

ఈ టర్నింగ్‌ వల్ల నిత్యం ఏదో ఓ చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 150 అడుగుల(ఫీట్ల) వెడల్పుతో రూ.1100 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దీనిని సూర్యాపేట నుంచి దుద్దెడ వరకున్న 365బీని ఎక్స్‌టెన్షన్‌ చేస్తూ మొత్తంగా 54 కి.మీ రోడ్డు నిర్మించనున్నారు. ఇప్పటికే డీపీఆర్‌ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..