• Sun. Mar 16th, 2025

అక్షర న్యూస్ : కరాటే పోటీల్లో గాయత్రి వివేకానంద విద్యార్థుల ప్రభంజనం..

Bypentam swamy

Nov 11, 2024

అక్షర న్యూస్ : జాతీయస్థాయి మూడవ కరాటే ,కుంగ్ పూ ఛాంపియన్షిప్ పోటీల్లో దుబ్బాక పట్టణ గాయత్రి వివేకానంద పాఠశాల విద్యార్థులు రెండు బంగారు పథకాలు సాధించారని యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు , అండ్ స్టైల్ చీఫ్ మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపారు. లక్ష్యం షోటోకాన్ కరాటే అకాడమీ ఇండియా వారి ఆధ్వర్యంలో ఆదివారం పటాన్చెర్ (జిహెచ్ఎంసి) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫంక్షన్ హాల్లో జాతీయస్థాయి కరాటే కుంగ్ పూ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సుమారు 800 మంది విద్యార్థులు పాల్గొనగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణం గాయత్రి వివేకానంద పాఠశాల కి చెందిన ఇద్దరు విద్యార్థులు తలారి నిశాల్ మూడవ తరగతి, కోన మనశ్విన్ ఆరవ తరగతి రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. 

అక్షర న్యూస్ : సిద్దిపేట లో వెలసిన శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం భక్తుల కోరికలు నెరవేరుస్తాడనీ భక్తుల అభిప్రాయం

ఈ సందర్భంగా కరాటే మాస్టర్ శ్రీకాంత్ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు, కరాటే విద్య నేర్చుకోవడం వల్ల ఆత్మ రక్షణ కోసం మానసికంగా, శరీరకంగా దృఢంగా ఉంటారని తెలిపారు. పథకాలు సాధించిన విద్యార్థులను మాస్టర్ బురాని శ్రీకాంత్, సురేందర్, సాయికుమార్, అమర్ సింగ్ అభినందించారు.

అక్షర న్యూస్ : కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు రెవెన్యూ సిబ్బంది మరియు వార్డు ఆఫీసర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు..