అక్షర న్యూస్ :కమిషన్ అశ్రిత్ కుమార్ గారు పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు.మొదటగా 33 వ వార్డులో కౌన్సిలర్ మోయిజ్ గారితో కలిసి వార్డులో పర్యటించడం జరిగింది.వార్డులో మురికి కాలువలో సిల్ట్, చెత్త తొలగించాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. పాత మార్కెట్ వద్ద చెత్త ఉండడం గమనించి వెంటనే చెత్త, చీదు,పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు.
వాటిలో పరిటిస్తుండగా శ్రీరామ హాస్పిటల్ వారు జనరేటర్ ని రోడ్డుపై ఏర్పాటు చేయడం గమనించి వెంటనే జనరేటర్ తొలగించాలని మరియు హాస్పిటల్ వ్యర్ధాలను బయటపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.శ్రీరామ్ హాస్పిటల్ ఎదురుగా దుర్గామాత మొబైల్ టిఫిన్ సెంటర్ వాహనం ఉండడం గమనించి అట్టి వాహనం వెంటనే తొలగించాలని లేనిచో అక్కడ వాహనం వెనకాల చెత్త కుప్ప ఏర్పడుతుందని వెంటనే వాహనాన్ని తొలగింప చేశారు. మరోసారి వాహనాన్ని అక్కడ నిలబరాదని వారికి సూచించారు.
అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి చెత్తను వెంటనే తొలగించాలని ఆదేశించారు. వాటిలో నూతన గృహ నిర్మాణ యజమానులు గృహ నిర్మాణ వ్యర్ధాలను బయటపడేయడం గమనించి వెంటనే తొలగింప చేయాలని మరియు రోడ్డుపై ఉన్నటువంటి కంకర ఇసుకను తొలగించాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు.పట్టణంలో ఎవరు కూడా మంచి నీటి నల్లాలకు మోటార్ లను బిగించవద్దన్నారు. వార్డులో పర్యటిస్తున్న సందర్భంలో పలు గృహ యజమానులు మోటార్ బిగించడం గమనించి వెంటనే తొలగింపు చేశారు.
ఆసిఫ్ అనే వ్యక్తి 1 HP మోటార్ బిగించడం మరియు అట్టి నీరు వృథాగా రోడ్డు మీదకు వెళ్ళడం గమనించి మోటార్ నీ సీజ్ చేయటం జరిగింది.