• Mon. Dec 8th, 2025

అక్షర న్యూస్ : మూసీ ప్రక్షాళన నేపథ్యంలో పాదయాత్రకు ప్రాధాన్యత..

Bypentam swamy

Nov 4, 2024

అక్షర న్యూస్ :తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 8వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. మూసీ ప్రక్షాళన నేపథ్యంలో ఆయన పాదయాత్రకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. నవంబరు 8న రేవంత్ రెడ్డి పుట్టినరోజు కాగా.

ఆ రోజున యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం అనంతరం ఆయన వలిగొండ మండలంలోని మూసీ గ్రామాల్లో పాదయాత్ర చేపట్టనున్నారు.

అక్షర న్యూస్: 63వ జాతీయ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..

పాదయాత్ర సమయంలో మూసీ పరీవాహక ప్రాంతంలోని రైతులు, ప్రజలను రేవంత్ రెడ్డి కలవనున్నారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకోనున్నారు. వారి నుంచి సలహాలు, సూచనలు కూడా స్వీకరిస్తారు. ఈ పాదయాత్రలో జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొననున్నారు.

అక్షర న్యూస్: పాలమాకుల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ కె. హైమావతి..