అక్షర న్యూస్ :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. బన్నీకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును తెచ్చిపెట్టిన ‘పుష్ప’కు ఇది సీక్వెల్. ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పాటలు, గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.
ఈ క్రమంలో ఇప్పుడు ఈ చిత్రంలోని ఐటెమ్ సాంగ్‌కు సంబంధించి ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ సాంగ్ చేయబోతున్నట్లు అందులో ఉంది. “టాలెంటెడ్ డ్యాన్సర్ శ్రీలీలకి స్వాగతం.. ఇద్దరు పవర్‌ఫుల్ డ్యాన్సర్లు వేదికపై నిప్పులు చెరిగేందుకు సిద్ధంగా ఉన్నారు” అంటూ ట్వీట్ చేశారు.
అలాగే ఈ పాట చిత్రీకరణ ఈ నెల 6 నుంచి మొదలుకానుందని తెలిపారు. ప్రముఖ నృత్యదర్శకుడు గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ అందించనున్నారు. దీనికి రేసుగుర్రంలోని సినిమా చూపిస్తా మావ అనే పాటపై శ్రీలీలను బన్నీ ఎత్తుకుని డ్యాన్స్ చేస్తున్న వీడియోను జోడించారు.