అక్షర న్యూస్ :77 గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కె. హైమావతి జాతీయ పతాకావిష్కరణ గావించారు.
అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా అధికారులు, కలెక్టరేట్ మరియు వివిధ శాఖల అధికారులు, సిబ్బందినుద్దేశించి మాట్లాడుతూ అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందేలా చూడాలన్నారు.



