• Fri. Jan 30th, 2026

అక్షర న్యూస్ : ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు: జాతీయ జెండాను ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్..

Bypentam swamy

Jan 26, 2026

అక్షర న్యూస్ :77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, ఈరోజు ఉదయం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్..,ఐపీఎస్ గారు ఘనంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.

కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్ గారు మాట్లాడుతూ:
దేశ సార్వభౌమాధికారాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడటంలో ప్రతి పోలీస్ అధికారి అంకితభావంతో పనిచేయాలని ,
ప్రజల భద్రతే లక్ష్యంగా, శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను జోడించి ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులు మరియు బాధ్యతలను స్మరించుకుంటూ, విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.

అక్షర న్యూస్ :దుబ్బాక BRS అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ గౌడ్ భారతీయ జనతా పార్టీ లో చేరారు..

పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు:
కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం, కమిషనర్ గారు పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రధాన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. అక్కడ పోలీసు దళాల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హైమవతి ఐఎస్ఐ గారు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పలువురు అధికారులకు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ హైమవతి గారు, కమిషనర్ గార్ల చేత ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలను అందజేశారు.

అక్షర న్యూస్ : 17వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంచర్ల శివకుమార్ నామినేషన్..

ఈ వేడుకల్లో అదనపు డీసీపీ ( ఎ ఆర్) సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్ లు , ఎస్ ఐ లు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.