అక్షర న్యూస్ :జగదేవ్ పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు.
భాగరా అన్నం, ఆలుగడ్డ చిక్కుడు టమాటా మిక్స్ కూరలను తనికి చేశారు. విద్యార్థులను వడ్డించే ప్రక్రియలో విద్యార్థుల అన్నం కి సరిపోయేంత కూరను పెట్టాలని వంట సిబ్బందిని ఆదేశించారు. కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులతో పలకరిస్తూ కూరలో చిక్కుడు, ఆలు ముక్కలను పడవెయ్యవద్దని అన్ని మంచిగా నమిలి తినాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు కూర్చుని తినెదగ్గరుకు వెళ్లి అన్నం కూర వడ్డించాలని వంట సిబ్బందిని ఆదేశించారు. పిల్లలకు చదువు మధ్యాహ్న బోజన విషయం లో రాజీపడవద్దని ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులను ఆదేశించారు.
అనంతరం జగదేవ్ పూర్ మరియు కొండపాక మండలాల తహసిల్దార్ కార్యాలయంలో ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఆయా మండలాల్లో ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతున్నందున అసహనం వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ మ్యాపింగ్ 100 శాతం పూర్తి చెయ్యాలి. ఆయా వార్డుల వారిగా జీపిఓలు, సూపర్ వైజర్ లు, బిఎల్ఓ లు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రోగ్రెస్ తక్కువున్నా పోలింగ్ స్టేషన్ లలో బి ఎల్ ఓ ల పనితీరును పర్యవేక్షణ తహసీల్దార్లను ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణకు సంబంధించిన అన్ని పనులను ఫీల్డ్ స్థాయిలో ఇంటింటి తనిఖీలు వేగవంతం చేయాలని ప్రతి రోజు చేసిన మ్యాపింగ్ వివరాలు కంప్యూటర్ లో అప్లోడ్ చేసే ప్రక్రియను పరిశీలించారు.



